గ్రామీణ ప్రాంతాలలో యువతీ, యువకులకు ఉపాధి కల్పించడంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వాలంటీర్లను నియమించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వైస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 625 జిల్లాల్లో 12వేల మందికి పైగా పని చేసే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి విజయవాడలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐదు వందల మందిని నియమించేందుకు నోటఫికేషన్ ఇవ్వగా, 25వేల మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. ఎంపిక చేయబడిన యువతీ, యువకులకు రెండేళ్ల పాటు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం అందిస్తామని తెలిపారు.
500 మంది వాలంటీర్లను నియమిస్తాం - volunteers
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా వాలంటీర్లను నియమించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వైస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
500 మంది వాలంటీర్లను నియమిస్తాం