శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగరపంచాయతీని సుందరంగా తీర్చిదిద్దుతామని శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి పేర్కొన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పాలకవర్గ చివరి సమావేశంలో ఆమె పాల్గొన్మారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య మెరుగుపడాల్సి ఉందన్నారు. డంపింగ్ యార్డ్ స్థల సేకరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యను మెరుగుపరిచేందుకు సంబంధిత మంత్రితో మాట్లాడతానన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని కోరారు. ఫిర్యాదులకు సరైన సమాధానం చెప్పాలని ఆదేశించారు.
'పాలకొండ నగరపంచాయతీని సుందరంగా తీర్చిదిద్దుతా' - srikakulam district
పాలకొండ నగరపంచాయతీని కార్యాలయంలో చివరి పాలకవర్గ సమావేశంలో శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. నగర పంచాయితీని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
'పాలకొండ నగరపంచాయతీని సుందరంగా తీర్చిదిద్దుతా'