నరసరావుపేట బరిలోనే రాయపాటి - రాయపాటి
సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు పోటీపై సందిగ్ధం వీడింది. గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు స్థానానికి ఆయన పోటీ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి విడుదలయిన తెదేపా లోక్సభ సభ్యుల జాబితాలో రాయపాటికి సీటు ఖరారు అయ్యింది.
ఎంపీ రాయపాటి సాంబశివరావు
గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీచేయట్లేదని ముందు చెప్పిన రాయపాటి.... తన కుమారుడు పోటీకి నిరాకరించడం వలన మళ్లీ ఆయనే బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటున్నట్లు రాయపాటి స్పష్టం చేశారు. ఈ నెల 22న నరసరావుపేటలో నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు.