ఇచ్ఛాపురం తెదేపా కంచుకోటగా ఉందని ఎంపీ అన్నారు. చంద్రబాబుకు మహిళల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈదుపురంలో ఇంటింటికీ మంచి నీటి కుళాయిల ఏర్పాటు, ఆస్పత్రి నిర్మాణం త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు. పసుపు-కుంకుమ మూడో విడత, చంద్ర బీమా పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షించారు.
'ఇచ్ఛాపురాన్ని తెదేపా కంచుకోటగా నిలబెడతాం' - రామ్మోహన్ నాయుడు
ఇచ్ఛాపురం తెదేపా కంచుకోటని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల పర్యటన చేపట్టిన ఆయన గ్రామాల్లో పర్యటిస్తూ ... చంద్రన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలన్నారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఇవీ చూడండి :రాజధానిగా విశాఖను ఎంపిక చేయాల్సింది: పవన్