మా సమావేశం అద్భుతం.. అందిస్తా సహకారం: మోదీ - వైఎస్ జగన్
రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తనను కలవడంపై మరోసారి ప్రధాని కాబోతున్న మోదీ.. ట్వీట్ చేశారు. ఈ సమావేశం అద్భుతమంటూ.. తెలుగులో ట్వీట్ చేశారు.
ModiJagan
నరేంద్ర మోదీ.. మరోసారి తెలుగులో ట్వీట్ చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్.. తనను కలిసిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. తమ మధ్య అద్భుతమైన సమావేశం జరిగిందని.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఫలవంతమైన చర్చ చేశామని చెప్పారు. కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు. తమ సమావేశానికి సంబంధించిన ఛాయాచిత్రాలను ట్వీట్‌కు జతపరిచారు.