ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తొలిసారి జిల్లాకు వచ్చిన మంత్రులకు ఘనస్వాగతం - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం...ఇద్దరు మంత్రి పదవులు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లా కర్నూలుకు వచ్చారు. మంత్రులకు వైకాపా నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్నారు.

పదవులు చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన మంత్రులు

By

Published : Jun 19, 2019, 11:46 PM IST

పదవులు చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన మంత్రులు
మంత్రి పదవులు చేపట్టిన తర్వాత...మొదటిసారిగా సొంత జిల్లా కర్నూలుకు వచ్చిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంలకు వైకాపా నాయకులు ఘనస్వాగతం పలికారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న మంత్రులకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప స్వాగతం పలికారు. ఉన్నతాధికారులు, వైకాపా నాయకులు పెద్ద ఎత్తున మంత్రులకు స్వాగతం పలికేందుకు అతిథి గృహానికి వచ్చారు. మంత్రులు ప్రభుత్వ అతిథి గృహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details