ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మంత్రి పదవికి కిడారి రాజీనామా...గవర్నర్ ఆమోదం - lokesh

మంత్రి పదవికి కిడారి శ్రావణ్‌ కుమార్‌ రాజీనామా చేశారు. గురువారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​తో సమావేశమయిన ఆయన రాజీనామా అంశంపై చర్చించారు.

sravan

By

Published : May 8, 2019, 8:41 AM IST

Updated : May 10, 2019, 7:28 AM IST

రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాజీనామా చేశానని శ్రావణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మంత్రిగా 6 నెలల పదవీ కాలంలో 3 నెలలు ఎన్నికల కోడ్‌కే పోయింద్న శ్రావణ్‌... గిరిజనుడిగా తనకు మంత్రి పదవి దక్కటం సంతోషం ఉందన్నారు. సీఎం చంద్రబాబు తనను కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారని కిడారి శ్రావణ్‌ పేర్కొన్నారు. తన శాఖ ద్వారా గిరిజనులకు ఫుడ్ బాస్కెట్ పథకం తేవటం సంతోషదాయకమని చెప్పారు.

మంత్రి పదవికి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా

శ్రావణ్ తండ్రి కిడారి సర్వేశ్వరరావు అరకు ఎమ్మెల్యేగా ఉండగా... మావోయిస్టులు హతమార్చారు. తదనంతరం శ్రావణ్​ను గతేఏడాది నవంబర్ 11న చంద్రబాబు మంత్రివర్గంలో తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండా మంత్రి అయిన ఆరు నెలల్లో... ఏదో ఒక చట్టసభకు ఎన్నిక కావాలి. కానీ ఇప్పటివరకు ఎన్నిక కాలేదు. మంత్రిగా శ్రావణ్​కుమార్ 6నెలల పదవికాలం ఈనెల 10వ తేదీతో ముగియనుంది.

మంత్రి పదవికి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా

కిడారి శ్రావణ్ పంపిన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆమోదించినట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది.

ఇదీ చదవండి...

మోదీ... ఓ విఫల ప్రధానమంత్రి : చంద్రబాబు

Last Updated : May 10, 2019, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details