ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తెలంగాణకో చట్టం.. ఏపీకో చట్టమా..?: మంత్రి సోమిరెడ్డి - ap news

కరవు, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సమీక్షలకు ఈసీ అనుమతివ్వాలని మంత్రి సోమిరెడ్డి అన్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణలో వ్యవసాయ మంత్రి అధికారులతో సమావేశమై మాట్లాడారు...అక్కడో చట్టం ..ఇక్కడో చట్టమా అని అమరావతిలో ప్రశ్నించారు.

మంత్రి సోమిరెడ్డి

By

Published : May 1, 2019, 7:00 PM IST

ఇలాంటి సమయాల్లోనూ..!

ఎన్నికల కోడ్​ ఉన్నపుడు ప్రభుత్వం సాధారణ పరిపాలన అందిచొచ్చని మంత్రి సోమిరెడ్డి అన్నారు. కరవు, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సమీక్షలకు అనుమతించాలని అమరావతిలో పేర్కొన్నారు. అలా చేయవద్దని చట్టంలో ఉందా అని ప్రశ్నించారు.

'పకృతి వైపరీత్యాల సమయాల్లో సమీక్షలకు ఈసీ అనుమతివ్వాలి. అధికారులకు దిశా నిర్దేశం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సాగు విధానాలను రైతులకు వివరించాలి. ఇలా సమీక్షలు చేయవద్దని చట్టంలో ఎక్కడైనా ఉందా. తెలంగాణకు ఓ చట్టం..ఏపీకి ఓ చట్టమా..?. సీఎం సమీక్షంటే అధికారులు భయపడుతున్నారు. ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని వైకాపా చూస్తోంది. కోడ్​ పేరుతో ప్రజాప్రయోజనాలు అడ్డుకుంటే మేమెందుకు..! ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సాధారణ పరిపాలన అందించొచ్చు'.
--- అమరావతి మీడియా సమావేశంలో మంత్రి సోమిరెడ్డి

ఇవీ చదవండి....'వారిది మాటల ప్రభుత్వం- మాది చేతల సర్కార్​'

ABOUT THE AUTHOR

...view details