టోల్ ప్లాజా సిబ్బందిపై... మంత్రి అనుచరులమంటూ దాడి!
మంత్రి బుగ్గన అనుచరులు అని చెప్పుకున్న కొందరు వ్యక్తులు కర్నూలు జిల్లా డోన్..టోల్ ప్లాజా సిబ్బందిపై దాడిచేశారు. ఈ దృశ్యాలు నిఘా కెమెరాలో నమోదయ్యాయి.
టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన మంత్రి బుగ్గన అనుచరులు!
కర్నూలు జిల్లా డోన్-అమకతాడు టోల్‌ప్లాజా వద్ద వైకాపా నేతలు హల్‌చల్ చేశారు. టోల్ రుసుం అడిగినందుకు ప్లాజా సిబ్బందిపై దాడిచేశారు. మంత్రి బుగ్గన అనుచరులనే టోల్ రుసుం అడుగుతారా... అంటూ విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు.
Last Updated : Jun 19, 2019, 10:59 PM IST
TAGGED:
toll plaza