కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట ఏఐటీయూసీ, జేఏసీల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆర్టీసీలో అద్దె బస్సులు తగ్గించి, ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. డిపో కార్యదర్శి నాగరాజు నాయకత్వంలో కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది నిరసన చేపట్టారు. పొరుగు సేవల విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఆర్టీసీ సిబ్బంది సంఖ్య తగ్గించాలనే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.
"పొరుగు సేవల విధానాన్ని రద్దు చేయాలి" - మైదుకూరు
ఆర్టీసీలో పొరుగు సేవల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కార్మికులు ఆందోళనకు దిగారు. అఖిల భారత వర్తక సమాఖ్య సంఘం(AITUC అనుబంధం), జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
మైదుకూరు ఆర్టీసీ సిబ్బంది ధర్నా