కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇంద్రనగర్కు చెందిన ప్రవీణ్, ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాలు తిరస్కరించాయని మనస్థాపానికి గురైన ప్రేమికులు పురుగుల మందు తాగారు. అచేతనంగా పడి ఉన్న వారిని స్థానికులు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం - kurnool
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఒక్కటవుదామనుకున్నారు. కానీ.. పెళ్లికి వాళ్ల కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో ప్రేమికులిద్దరూ పురుగుల మందు తాగి తనువు చాలించాలనుకున్నారు. గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
పురుగుల మందు తాగిన ప్రేమ జంట