లోపభూయిష్ఠమైన ఈవీఎంలతో తెలుగు ప్రజలను అర్ధరాత్రి వరకూ లైన్లలలో నిలబెట్టిన ఈసీని ఏవిధంగా వైకాపా వెనుకేసుకోస్తోందని లంకా ప్రశ్నించారు. వైకాపా ఫిర్యాదులపై మాత్రమే స్పందించే ఎన్నికల సంఘం వైకాపా-భాజపా జేబు సంస్థగా మారిందని అన్నారు.
ఈసీని వెనకేసుకొచ్చిన వైకాపా...ఏపీ ప్రజలను మోసం చేసింది : లంకా దినకర్ - జగన్
రాజ్యాంగం అందించిన ఓటు హక్కును వినియోగించుకోనివ్వకుండా గొడవలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నించిందని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు.
లంకా దినకర్
ఓటమి భయంతోనే వైకాపా హింసకు పాల్పడిందని లంకా దినకర్ విమర్శించారు. ఓటింగ్ శాతం తగ్గించాలని వైకాపా నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజాచైతన్యంతో వారి వ్యూహాలన్నీ విఫలమయ్యాయన్నారు. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారన్న ఆయన... చంద్రబాబును గెలిపించేందుకు ఏపీ ప్రజలు ఎప్పుడూ ముందుంటారన్నారు.
ఇవీ చూడండి :సీఎం తీరుపై గవర్నర్కు విజయసాయి లేఖ