పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మేడికొండ పృథ్వీ గణేశ్‌కి అదే జిల్లాకు చెందిన కృష్ణవేణికి 2011లో వివాహమయ్యింది. వీరు హైదరాబాద్ కె.పి.హెచ్.బి. ధర్మారెడ్డికాలనీ ఫేజ్-1లో నివాసముంటున్నారు. సతీశ్ అనే వ్యక్తికి పృథ్వీ గణేష్ 9 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. ఆ అప్పు తీసుకున్న సతీష్ డబ్బులు వెనక్కి ఇవ్వకుండా వారిని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆదివారం నాడు డబ్బుల కోసం సతీష్ ఇంటికి వెళ్ళిన కృష్ణవేణిని మద్యం మత్తులో ఉన్న సతీష్ దూషించాడు. అవమానంతో అక్కడి నుండి వెనక్కి వచ్చేశారు కృష్ణవేణి.
అప్పు తీసుకున్న వ్యక్తి వేధించాడని మహిళ ఆత్మహత్య - women suicide
అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మనం చూశాం... కానీ ఇక్కడ అప్పు తీసుకున్న వ్యక్తి అసభ్య ప్రవర్తనకు అప్పు ఇచ్చిన కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ కె.పి.హెచ్.బి. పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అప్పు తీసుకున్న వ్యక్తి వేధించాడని మహిళ ఆత్మహత్య
అదే రోజు సాయంత్రం సతీష్ మద్యం సేవించి గణేష్ ఇంటికి వచ్చి, గణేష్ తో వాగ్వాదానికి దిగటమే కాకుండా అతడి ఫోన్ నేలకేసి కొట్టి పగులగొట్టాడు. అదే సమయంలో సతీష్‌ను వారించటానికి కృష్ణవేణి ప్రయత్నించటంతో ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఆమె సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.