కస్తూరీబా బాలికల పాఠశాల్లో ప్రవేశాలు..ఏప్రిల్ 25 నుంచి దరఖాస్తులు - girls
కస్తూరీబా గాంధీ(కేజీబీవీ) బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 352 కేజీబీవీల్లో 6,7,8 తరగతులకు బాలికల నుంచి అడ్మిషన్లు కోరుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఒక్కో కేజీబీవీలో ఆరో తరగతికి 40 సీట్లు, 7,8 తరగతులకు ఆయా పాఠశాలలో ఖాళీలను బట్టి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. పదేళ్లు నిండిన బాలికలు ఆరో తరగతిలో చేరవచ్చని స్పష్టం చేశారు. ప్రవేశాలలో బడి మానేసిన, అనాథ, దివ్యాంగ బాలికలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ప్రవేశాల కోసం ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మైనారిటీ బాలికల కోసం గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రత్యేక కేజీబీవీలు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది 14 వేల సీట్లుకు 27వేల దరఖాస్తులు వచ్చాయన్న శ్రీనివాస్.. ఈసారి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.