వడ్డీ లేని రుణాలు..
ఐదేళ్లలో 68 వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు అందించామన్న కళా...వడ్డీ రాయితీగా ప్రభుత్వం 2వేల514 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకంతో బ్యాంకులూ రుణాలిచ్చేందుకు ముందుకొచ్చాయని తెలిపారు.రుణాలు తీసుకున్న వారంతా అప్పులపాలయ్యారని ప్రచారం చేయటంపై ఆగ్రహించిన కళా...ఎవరి హామీలు, మేనిఫెస్టోలు మెరుగైనవో మహిళలే గమనించాలని సూచించారు.
మహిళా సంఘాలే రాష్ట్రానికి దిక్సూచి: కళా వెంకట్రావు - కళా వెంకట్రావు లేఖ
రాష్ట్రంలోని మహిళలు అభ్యున్నతికి తెదేపా అహర్నిశలు కృషి చేస్తోందని కళా వెంకట్రావు అన్నారు. డ్వాక్రా సంఘ మహిళలకు మంత్రి బహిరంగ లేఖ రాశారు. మహిళలను ఆడపడుచులుగా భావించే ఏకైక పార్టీ తెదేపానన్న కళా... ప్రగతిపథంలో వెళ్తున్న రాష్ట్రానికి మహిళా సంఘాలే దిక్సూచి అన్నారు.
మంత్రి కళా వెంకట్రావు
ఇవీ చూడండి :పవన్ ప్రచార వాహనంలో పొగలు.. తప్పిన ప్రమాదం