రాష్ట్రప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధికి జగన్ అడ్డుపడవద్దని..తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, కడప ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆక్షేపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీతో ప్రతిపక్షనేత చేతులు కలిపి పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర పురోగతికి అడ్డుపడేలా ప్రవర్తిస్తే..జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
'రాష్ట్రాభివృద్ధికి జగన్ సహకరించకపోయినా ఫర్వాలేదు' - ap news
రాష్ట్రాభివృద్ధికి జగన్ సహకరించకపోయినా..ఫర్వాలేదు కానీ అడ్డుపడవద్దని...తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మండిపడ్డారు. పోలవరంపై అవాస్తావాలు ప్రచారం చేస్తే..చరిత్రహీనుడుగా జగన్ మిగిలిపోతారని పేర్కొన్నారు.
!['రాష్ట్రాభివృద్ధికి జగన్ సహకరించకపోయినా ఫర్వాలేదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3219195-962-3219195-1557260580592.jpg)
'రాష్ట్రాభివృద్ధికి జగన్ సహకరించకపోయినా ఫర్వాలేదు'