ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

లక్ష ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది: కేఏ పాల్ - భాజపా

భాజపా లక్ష ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిందని కేఏ పాల్ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన భాజపా.. నాలుగు నెలల్లో 4 ఎంపీ సీట్లు ఎలా గెలుచుకుందని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు.

లక్ష ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది : కేఏ పాల్

By

Published : May 25, 2019, 5:02 PM IST

లక్ష ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది : కేఏ పాల్

ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. భాజపా, వైకాపాలు గెలవడానికి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమన్నారు. డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో 4 శాతం ఓట్లు రాని భాజపాకు పార్లమెంట్ ఎన్నికల్లో 20 శాతం ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే భాజపా గెలిచిందన్నారు. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నడిచిందన్నారు. వైకాపాకు 151 సీట్లు రావడంపై విమర్శలు చేసిన ఆయన... విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. అధికారం సాధించిన వైకాపా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

వీవీ ప్యాట్​లు లెక్కించిన తరువాతే ఈవీఎం ఓట్లు లెక్కించాలని 21 ప్రతిపక్షపార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కొందరు నేతల అవినీతి చిట్టాలు బయటకు వస్తాయని భయపడుతున్నారన్న ఆయన...కేఏ పాల్ ఎవ్వరికీ భయపడరని గుర్తుచేశారు. భారత ఎన్నికల విధానం సరిగా లేదన్న పాల్..ఏడు విడతల ఎన్నికలు ఏ దేశంలోనూ జరగవని విమర్శించారు.

ఇవీ చూడండి :డ్రోన్ల డ్యాన్స్​తో ఆకాశంలో జిల్​జిల్ జిగాజిగా

ABOUT THE AUTHOR

...view details