ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జనవరిలో తగ్గిన ద్రవ్యోల్బణం - తగ్గుదల

రిజర్వు బ్యాంకు నిర్ణయాలకు ఆధారమైన రిటైల్​ ధరల పెరుగుదల జనవరిలో తగ్గింది.

ద్రవ్యోల్బణం

By

Published : Feb 12, 2019, 11:28 PM IST

డిసెంబర్​లో 2.11 శాతంగా ఉన్న రిటైల్​ ద్రవ్యోల్బణం జనవరిలో 2.05 శాతానికి తగ్గింది. కూరగాయలు, గుడ్ల ధరలతో పాటు ఆహార పదార్థాల ధరల తగ్గుదల దీనికి దోహాదపడింది. కేంద్ర గణాంక కార్యాలయం జనవరి నెలకు సంబంధించి విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి.

జనవరి 2018లో ఈ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా ఉంది. 2018 డిసెంబర్​లో 2.19 శాతంగా ఉన్న వినియోగదారు ద్రవ్యోల్బణం సవరించిన అంచనాల ప్రకారం 2.11 శాతానికి తగ్గింది. డిసెంబర్​లో 4.54 శాతంగా ఉన్న ఇంధన, విద్యుత్​ ద్రవ్యోల్బణం 2.2 శాతానికి పడిపోయింది.

ద్రవ్య పరపతి విధాన సమీక్షకు రిటైల్​ ద్రవ్యోల్బణాన్నే రిజర్వు బ్యాంకు ఆధారంగా తీసుకుంటుంది. గత త్రైమాసిక ద్రవ్యోల్బణ అంచనాలను 2.8 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.

ABOUT THE AUTHOR

...view details