ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్​​ ప్రమాణ స్వీకారానికి కొనసాగుతున్న ఏర్పాట్లు - కేసీఆర్

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ కార్యక్రమం జరిగే తీరును, ఏర్పాట్లను కాబోయే సీఎం జగన్​కు అధికారులు వివరించారు. ప్రజలు, వీఐపీలు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ దిల్లీ వెళ్లే అవకాశం ఉందని వైకాపా నేతలు అంటున్నారు.

జగన్​​ ప్రమాణ స్వీకారానికి కొనసాగుతున్న ఏర్పాట్లు
author img

By

Published : May 27, 2019, 4:44 PM IST

Updated : May 27, 2019, 5:30 PM IST

జగన్​​ ప్రమాణ స్వీకారానికి కొనసాగుతున్న ఏర్పాట్లు

ఈ నెల 30న నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్​ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కార్యకర్తలు, నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరును అధికారులు జగన్​కు వివరించారు. వీఐపీలు, ప్రజలు చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంతియాజ్... జగన్​కు తెలిపారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జగన్ దిల్లీ వెళ్లే అవకాశం ఉందని వైకాపా నేతలు అంటున్నారు. ఈ నెల 30 సాయంత్రం...ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో కలిసి, జగన్ దిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

కాబోయే సీఎం జగన్‌తో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల మర్యాదపూర్వక భేటీలు కొనసాగుతున్నాయి. వైఎస్‌ జగన్‌ను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంయుక్త కలెక్టర్లు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్​ చీఫ్​గా నియమితులయ్యారని ప్రచారం జరుగుతున్న తెలంగాణ ఐపీఎస్​ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర జగన్​ను కలిసి అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి : ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్​గా స్టీఫెన్ రవీంద్ర..!

Last Updated : May 27, 2019, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details