ప్రత్యేకహోదాపై కేసీఆర్ తో కేంద్రానికి లేఖ రాయించగలరా... - చంద్రబాబు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతు ఇస్తున్నట్లు జగన్ కేంద్రానికి లేఖ రాయించగలరా అని సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన ఐదు అంశాలపై తెరాస వైఖరి తెలపాలన్నారు.
ప్రత్యేకహోదాపై కేసీఆర్ తో కేంద్రానికి లేఖ రాయించగలరా...
ఐదుకోట్ల రాష్ట్ర ప్రజల తరపున జగన్ ను అడుగుతున్నా ప్రత్యేకహోదాపై అభ్యంతరం లేదని కేసీఆర్ తో కేంద్రానికి లేఖ రాయించగలరా...పోలవరంపై వేసిన కేసుల్ని వెనక్కి తీసుకునేలా చేయగలరా...శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి వనరులపై ఆంధ్ర హక్కులకు రక్షణ కల్పించగలరా...హైదరాబాద్ ఆస్తుల విషయంపై న్యాయం చేయించగలరా... కీలకమైన ఐదు అంశాల్లో మనకు న్యాయం జరిగినప్పుడు జగన్ చెప్పిన మాటలకు విశ్వసనీయత ఉంటుంది.
Last Updated : Apr 8, 2019, 7:44 PM IST