బడి అంటే చదవాలి...హోంవర్కు చేయాలి అనే భయాన్ని విద్యార్థుల్లో పోగొట్టి సంతోషంగా పాఠశాలకు వచ్చే వాతావరణాన్ని పార్వతి సృష్టించారు. తను రాక ముందు విద్యార్థుల్లేక మూసేసే పరిస్థితి. కానీ ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టాక మెల్లగా ఆ పరిస్థితిని ఆమె మార్చివేసింది. మౌళిక వసతులు సమకూర్చింది. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో చైతన్యం పెంపోదించింది.
బోరింగ్ చదువు పోయే...బొమ్మల చదువొచ్చే
ఎన్ని వృత్తులున్నా...ఉపాధ్యాయ వృత్తికున్న ప్రత్యేకతే వేరు.. విద్యార్థులను అన్ని రంగాల్లో ఉత్తమంగా తీర్చిదిద్దడంలో గురువులు పాత్ర ఎనలేనిది...విద్యార్థుల్లేక మూసేసే దశలో ఉన్న పాఠశాలను...తిరిగి పిల్లలతో కళకళలాడేలా చేసి ...రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మహిళా ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు...కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెంలో పనిచేస్తున్న గాజుల పార్వతి.
విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో పార్వతి బోధిస్తారు. చిరుధాన్యాలతో బొమ్మలు తయారు చేస్తారు. వాటిలో ఉండే పోషకాలపై అవగాహన కల్పిస్తారు. తినకపోతే కలిగే నష్టాలను వివరించి...ఎవర్నడిగినా సమాధానం చెప్పేలా విద్యార్ధులను తయారు చేశారు. బొమ్మల రూపంలో గుణింతాలను వివరిస్తారు. ప్రతీ విద్యార్థికీ అర్థమయ్యేలా సులభంగా విద్యాబోధన చేస్తారు.
ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం...ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలు అవార్డుతో సత్కరించింది. మరేన్నో ప్రశంసా పత్రాలు అందుకుంది. వినూత్నంగా పాఠాలు నేర్పుతున్న పార్వతిని చూసి...తోటి ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ప్రశంసిస్తున్నారు.