ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. వీవీప్యాట్ల అంశంపై మరోసారి పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంలలో మోసాలు జరగడం లేదని నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ, ఏపీలో చాలా చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయించాయని... ఇంకా ఆరు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని... దీనిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈసీ విశ్వసనీయతపై అనుమానాలున్నాయి: సురవరం
ఎన్నికలు సజావుగా జరిగేందుకు సీఈసీ సరైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. ఈసీ విశ్వసనీయతపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
suravaram