ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధితోనే నవభారత్: మోదీ

అరుణాచల్​ ప్రదేశ్​లో పర్యటించిన ప్రధాని మోదీ... గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రాభివృద్ధిలో జాప్యం జరిగిందని ఆరోపించారు.

అరుణాచల్​ ప్రదేశ్​లో పర్యటనలో ప్రధాని మోదీ

By

Published : Feb 9, 2019, 2:07 PM IST

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధితోనే నవభారత్​ నిర్మాణం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అరుణాచల్​ ప్రదేశ్​ రాజధాని ఈటానగర్​లో పర్యటించిన మోదీ... పలు ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్వవహరించాయని ఆరోపించారు మోదీ.

అరుణాచల్​ ప్రదేశ్​లో పర్యటనలో ప్రధాని మోదీ

"అరుణాచల్ ప్రదేశ్​​కు జల సంపద చాలా ఉంది. విద్యుదుత్పత్తి చేయడానికి మంచి అవకాశాలున్నాయి. కానీ అనుకున్న విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు. ఇది దేశ రక్షణకు సంబంధించి గొప్ప ప్రదేశం. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ప్రాంతం. కానీ ఇక్కడ కనీస సదుపాయాల నిర్మాణమూ జరగట్లేదు. గత ప్రభుత్వాలు ఈ సమస్యను తక్కువ అంచనా వేసి... తమ నిర్లక్ష్యంతో ఇక్కడి వారిని ఎంతో బాధపెట్టాయి. ఎన్నో దశాబ్దాలుగా అరుణాచల్​ ప్రదేశ్​ సహా ఇక్కడి అనేక ప్రాంతాల్లో అధునాతన సదుపాయాల ఆవశ్యకత గురించి తెలిసిందే. గత ప్రభుత్వాలు వీటిని పట్టించుకోలేదు. మా ప్రభుత్వంతో ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాం."
---- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

ప్రాజెక్టులకు శంకుస్థాపన...

రూ. 4వేల కోట్లు విలువచేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. అరుణాచల్​ ప్రదేశ్​ నూతన దూరదర్శన్​ ఛానెల్​ను ప్రారంభించారు. 110 మెగావాట్ల జల విద్యుత్​ కేంద్రాన్ని ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. జోట్​లో ఫిల్మ్​ అండ్​ టెలివిజన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎఫ్​టీఐఐ) క్యాంపస్​కు శ్రీకారం చుట్టారు మోదీ. హోల్లొంగి, టెజు ప్రాంతాల్లో రెండు విమానాశ్రయాల నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

సరికొత్త వేషధారణలో ప్రధాని...

మోదీ అరుణాచల్​ ప్రదేశ్ గిరిజన​ సంప్రదాయ దుస్తుల్లో ప్రజలను ఆకట్టుకున్నారు. నెమలీకతో కూడిన తలపాగాను ధరించి ప్రత్యేకత చాటారు.

ABOUT THE AUTHOR

...view details