విజయవాడ కృష్ణలంకలో తెల్లవారు జామున దారుణమైన ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో భర్త హీనమైన చర్యకు పాల్పడ్డాడు. ఇల్లాలిపై నమ్మకం లేక... గర్భిణీ అని చూడకుండా పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. భార్య శైలజ కృష్ణలంకలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. భర్త నంబియార్ గుడివాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. అనుమానంతో ఎప్పుడూ ఇంట్లో తగాదా పెట్టుకునేవాడని స్థానికులు చెబుతున్నారు. ఆ అనుమానం కాస్త మితిమీరి ఆమెను బలి తీసుకున్నాడని బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ ఘటనపై కృష్ణలంక పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆరునెలల గర్భిణీకి నిప్పు... అనుమానంతో భర్త దాష్టికం - wife murder
విజయవాడ కృష్ణలంకలో ఘోరం. ఆరు నెలల గర్భిణీపైన భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఆరునెలల గర్భిణీకి నిప్పు... అనుమానంతో భర్త దాష్టికం