ఐపీఎస్ అధికారుల బదిలీలపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. వైకాపా వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు తీసుకుంది.సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వైకాపా తరఫున వాదనలు వినిపించారు. అనంతరం ఈసీ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు రాష్ట్రానికి లేదన్నారు. ఈసీకి అందిన ఫిర్యాదుల మేరకే చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు వాయిదా వేసింది.
ఐపీఎస్ బదిలీలపై హైకోర్టులో తీర్పు వాయిదా - ఈసీఐ
ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈసీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది... రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. ఈ అంశంపై వైకాపా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించింది.
ఐపీఎస్ బదిలీపై ముగిసిన వాదనలు