హైతీ అధ్యక్షుడి నివాసంపై రాళ్ల దాడి - నిరసనలు
కరీబియన్ దీవిలోని హైతీలో ప్రభుత్వ వ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంది. ఏకంగా అధ్యక్షుడి ఇంటిపైనే నిరసనకారులు రాళ్లు రువ్వారు.
హైతీ అధ్యక్షుడి నివాసంపై రాళ్ల దాడి
కరీబియన్ దీవిలోని హైతీలో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. ప్రజాధనం దుర్వినియోగం, ద్రవ్యోల్బణ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రజల ఆందోళన ఐదోరోజుకు చేరింది. హైతీ రాజధానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు... రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. టైర్లకు నిప్పంటించారు. అధ్యక్షుడి నివాసంపై రాళ్ల దాడి చేశారు. అధ్యక్షుడు సత్వర చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.