తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ మందిరంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిబ్బంది తక్షణమే అప్రమత్తమై అదుపు చేశారు. రాత్రి 7 గంటలకు సేవ ముగిసినంతరం ఇనుప ఛత్రాలుతో వుండే తలుపులు మూసి వేశారు. కాసేపటికి వెలుగుతున్న దీపాలు ఒకదానిని ఒకటి అంటుకుని మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటలు ఆపివేశారు.
దీపాలు కారణంగా అన్నవరం గుడిలో అగ్నిప్రమాదం - east godavari
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో సహస్ర దీపాలంకరణ మందిరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిబ్బంది అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది.
అన్నవరం గుడిలో స్వల్ప అగ్ని ప్రమాదం