రాయితీ విత్తనాల కోసం అనంతపురం జిల్లాలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మడకశిరలో గత 10రోజుల నుంచి రైతులు రోడ్డెక్కుతున్నా... విత్తనాలు మాత్రం అందించలేకపోతున్నారు. ఈ రోజు కూడా విత్తనాల కోసం రైతులు అర్ధరాత్రి నుంచే కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం అధికారులు వచ్చి విత్తనం లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. మడకశిరలోని రాజీవ్ గాంధీ కూడలిలో చుట్టుపక్క గ్రామాల నుంచి వచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విత్తనాలు పంపిణీ చేసే వరకు రోడ్డుపై నుంచి వెళ్లేది లేదని బైఠాయించారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. మడకశిర పట్టణమే కాకుండా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కూడా రైతులు వేరుశనగ విత్తనాలకై ప్రతిరోజు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎన్నిరోజులు ఇలా అగచాట్లు పడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దొరకని విత్తనాలు.. ఆగని రైతన్నల అందోళనలు - rajiv gandhi circle
అనంతపురం జిల్లాలో విత్తనాల కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కోసం అర్ధరాత్రి వరకు కేంద్రాల వద్ద పడిగాపులు పడినా.. నిరాశే ఎదురవుతోంది.
విత్తనాలు లేక ఆందోళనకు దిగిన రైతన్నలు