ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కె.రాజుపాలెం గ్రామం శాంతినగర్ కాలనీకి చెందిన శాఖమూరు హనుమంతరావు (42) అనే రైతు.. అప్పుల బాధ తాళలేక సొంత వ్యవసాయ భూమిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమంతరావు మార్టూరు కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో నాలుగు ఏళ్ల క్రితం లక్షా ఎనభై వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. ఆ రుణంపై వడ్డీ రూ. 14 వేలు చెల్లించాడు. ఇంకా రెండు లక్షల నలభై వేల రూపాయల బాకీ ఉందని బ్యాంకు అధికారులు గ్రామంలో నోటీసులు అంటించి పొలంలో జెండాలు పాతారు. ఆ పొలం బ్యాంక్ ఆస్తి అని దండోరా వేయించారు. అప్పుల అవమానం భారం తట్టుకోలేక సొంత పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు.
అప్పులపై బ్యాంకు దండోరా.. రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక మరో రైతు ప్రాణాలు తీసుకున్నాడు. సొంత పొలంలోనే ఉరేసుకున్నాడు. బ్యాంకు, బంధువులు వద్ద చేసిన అప్పు తీర్చలేక... పొలం స్వాధీనం చేసుకుంటామని అధికారులు వేయించిన దండోరాతో బాధను భరించలేక... ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధ తాళలేక సొంత పొలంలోనే ఉరి వేసుకున్న రైతు