నకిలీ నోట్ల బీటెక్ బాబు...కటకటాల పాలయ్యాడు - fake currency
చదివింది బీటెక్.. చేసేది ఘరాన మోసం. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నకిలీ బాట ఎంచుకున్నాడు. ఇంజనీరింగ్లో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీ నోట్ల తయారీకి మొదలుపెట్టాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా చిరువ్యాపారులే లక్ష్యంగా నకిలీ నోట్ల దందా ప్రారంభించాడు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ నోట్ల చలామణీపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రూ. 13 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
అశ్వనీకుమార్ తన స్నేహితుడు డేవిడ్ రాజుతో కలిసి..నగరంలోని కర్రి పాయింట్లు, క్యాంటీన్లు, కూరగాయల.. వ్యాపారులు, చిరువ్యాపారులతో పరిచయం చేసుకున్నాడు. తమకు పాత పరిచయమున్న మరో ఇద్దరికి నకిలీ నోట్లు ఇచ్చి చలామణీకి పాల్పడ్డారు. లక్ష రూపాయల అసలు నోట్లకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇచ్చారు. నకిలీ నోట్ల చలామణీపై టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టారు. పథకం ప్రకారం అశ్వనీకుమార్, డేవిడ్ రాజు పట్టుకున్నారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 13 లక్షల రూపాయలు విలువ చేసే..2 వేలు, 100 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.