ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 3, 2019, 7:32 PM IST

ETV Bharat / briefs

ఎర్ర చీమల గుడ్ల పచ్చడి... మీకు తెలుసా!

అడవిలో బతకడం కష్టంతో కూడినది. అందులో ఆహారం కోసం రోజు అన్వేషణ చేయాల్సిందే. పర్యావరణ అసమతుల్యత వల్ల గిరిజనం తిండికై తిప్పలు పడుతున్నారు. ఆహారం లభించకపోవడం వల్ల భద్రాద్రి మన్నెం వాసులు ఎర్ర చీమల గుడ్లతో పచ్చడి చేసుకుని కడుపు నింపుకొంటున్నారు.

red pickle

అసలే మన్యం.. పూట గడవడమే కష్టం.. కష్టాల కడలిలో బతుకీడ్చే గిరిజనం. అడవిలో దొరికే ఆకులే వారకి ఆహారం. అలాంటి మన్యం వాసులు... క్షుద్బాధ తీర్చుకునేందుకు ఎర్రచీమల గుడ్లతో పచ్చడి చేసుకుని తింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో తరచుగా ఈ రకమైన దృశ్యాలు కనబడుతుంటాయి.

ఇక్కడ జిన్నెచెట్లపై ఉన్న ఎర్రచీమలు, వాటి గుడ్లను సేకరించే పనుల్లో ఆదివాసీలు రోజుల తరబడి నిమగ్నమవుతారు. ఎర్రచీమలు, వాటి గుడ్లతో పచ్చడి చేసుకుని తింటున్నారు. సమీప ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో వీటితో కూరను సైతం వండుకుంటారని ఇక్కడి ఆదివాసీలు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సంతల్లోనూ చీమలు, వాటి గుడ్లను గొత్తికోయలు సేకరించి.. కుప్పలుగా పోసి విక్రయిస్తుంటారంటున్నారు.

ఇదీ చూడండి. జరభద్రం: బాలుడికి ప్రమాదం... పెద్దలకు పాఠం

ABOUT THE AUTHOR

...view details