ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎనిమిదికి చేరిన కుల్గాం మృతుల సంఖ్య

కశ్మీర్​ కుల్గాం జిల్లాలోని జవహార్​ టన్నెల్​లో సమీపంలో మంచు కొండ దొర్లిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

ఎనిమిదికి చేరిన కుల్గాం మృతుల సంఖ్య

By

Published : Feb 10, 2019, 9:45 AM IST

కశ్మీర్​ కుల్గాం జిల్లాలోని జవహార్​ టన్నెల్​ పోలీసు పోస్టుపైకి మూడు రోజుల క్రితం భారీ మంచు గడ్డ దొర్లిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమది మందికి చేరింది. మృతుల్లో ఆరుగురు పోలీసులు, ఇద్దరు ఖైదీలు ఉన్నారు.

జవహార్​ టన్నెల్​ తూర్పు పోలీసు పోస్టులోకి గురువారం ఓ భారీ మంచు కొండ దొర్లుతూ దూసుకొచ్చింది. ప్రమాదాన్ని గుర్తించిన పది మంది పోలీసులు తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతా పది మంది మాత్రం టన్నెల్​లోనే చిక్కుకుపోయారు. మరో ఇద్దరు పోలీసులను రక్షణ సిబ్బంది కాపాడారు.

ABOUT THE AUTHOR

...view details