ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎన్డీఏ ఒప్పందమే చౌక :రఫేల్​పై కాగ్​ - NDA

రఫేల్ ఒప్పందంపై విపక్షాల విమర్శలు పెరిగిపోతున్న సమయంలో కాగ్​ నివేదిక ఎన్డీఏకు ఊరటనిచ్చింది. యూపీఏ హయాంలో కన్నా ప్రస్తుత ఒప్పందం చౌకైనదని కాగ్​ స్పష్టం చేసింది.

ఎన్డీఏ ఒప్పందమే చౌకని కాగ్ నివేదిక

By

Published : Feb 13, 2019, 3:36 PM IST

ఎన్డీయే ప్రభుత్వం చేసుకున్న రఫేల్​ ఒప్పందంపై కంప్ట్రోలర్​ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్​) నివేదికను పార్లమెంటులో సమర్పించింది. యూపీఏ హయాంలో చేసుకన్న ఒప్పందం కన్నా ఎన్డీయే ప్రభుత్వ ఒప్పందంలో 2.86 శాతం ఖర్చు తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా 17 శాతం ధనాన్ని ఆదా చేస్తూనే మరిన్ని భద్రతా అంశాలు పొందుపరచారని వెల్లడించింది కాగ్.

యూపీఏ హయాంలో వైఫల్యాల వల్లనే ఆలస్యం జరిగిందని కాగ్​ పేర్కొంది. అందుకు కారణాలుగా ఈ కింది అంశాలను చూపింది.

  • భారత వాయుసేన తన అవసరాలను స్పష్టంగా వెల్లడించలేదు.
  • ఫలితంగా ఏ కంపెనీ ఒప్పందానికి మొగ్గు చూపలేదు.
  • వీటితో పాటు తరచూ వాయుసేన అవసరాలను మారుస్తూ వచ్చింది.

యూపీఏ హయాంలోని వైఫల్యాలను గుర్తించి మోదీ ప్రభుత్వానికి రక్షణ శాఖ 2015లో కొన్ని కింద పేర్కొన్న సూచనలు చేసింది.

  • డసో ఏవియేషన్​ అధిక ధరలు చెబుతోంది.
  • ఐరోపా ఎరోనాటిక్​ డిఫెన్స్, స్పేస్​ కంపెనీ(ఈడ్స్) పూర్తి స్థాయి అవసరాలు తీర్చలేదు.
  • వైఫల్యాలను గుర్తించి కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది.

నివేదికను కాంగ్రెస్​ తప్పుబట్టింది. ముందుగానే సుప్రీం కోర్టుకు కాగ్​ తన ఉద్దేశాన్ని తెలిపిందని కాంగ్రెస్ ఆరోపించింది.

ABOUT THE AUTHOR

...view details