చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో పట్టణ సీఐ సురేశ్‌కుమార్‌పై బదిలీ వేటు పడింది. జిల్లా ఎన్నికల పరిశీలకుడి ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కేసు నమోదు చేయకపోడవంపై ఈసీ...సీఐను విధుల నుంచి తప్పించింది. సురేశ్ కుమార్ స్థానంలో సుబ్బారాయుడి నియమించాల్సిందిగా డీజీపీకి ఈసీ సూచించింది. ఎన్నికల్లో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అధికారులు రాజకీయ ప్రలోభాలకు లొంగకూడదని ఈసీ తెలిపింది. ప్రజలకు ఇబ్బంది కలిగితే కఠినంగా వ్యవహరిస్తామని ద్వివేది తెలిపారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. మదనపల్లి సీఐపై బదిలీ వేటు - మదనపల్లి సీఐ
ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన మదనపల్లి సీఐపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను తక్షణం బదిలీ చేయాల్సిందిగా రాష్ట్ర డీజీపీకి సూచించింది. ఆయన స్థానంలో సుబ్బారాయుడిని నియమించాల్సిందిగా ఈసీ ఆదేశించింది.
సీఈవో ద్వివేదీ
పోలింగ్ విధులకు ప్రైవేట్, ఒప్పంద ఉద్యోగులను తీసుకోవద్దని ఈసీ సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలని ఆదేశించింది. సెర్ప్ సీఈవో కృష్ణమోహన్పై వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు సీఈవో ద్వివేది తెలిపారు.