ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఈవీఎంలు, వీవీ ప్యాట్ కౌంటింగ్​పై ఆర్వోలకు శిక్షణ - ec

ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఓట్ల లెక్కింపు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలకు ఈసీ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

ఈవీఎంలు, వీవీప్యాట్​ పై ఆర్వోలకు శిక్షణ

By

Published : May 16, 2019, 9:04 PM IST

Updated : May 16, 2019, 9:18 PM IST

ఈవీఎంలు, వీవీ ప్యాట్ కౌంటింగ్​పై ఆర్వోలకు శిక్షణ

ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న సందర్భంలో కౌంటింగ్ రోజున పాటించాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని మొత్తం 25 లోక్​సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనుంది. కౌంటింగ్ రోజు ఈవీఎంలు తరలింపు, ఓట్లు, వీవీప్యాట్ల లెక్కింపుపై శిక్షణ ఇవ్వనుంది.

విజయవాడ గురునానక్ కాలనీ ఎన్​ఏసీ కల్యాణమండపంలో శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది, ఈసీ డైరెక్టర్, అండర్ సెక్రటరీ హాజరుకానున్నారు.

Last Updated : May 16, 2019, 9:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details