ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఇప్పటివరకు 16 కోట్ల నగదు స్వాధీనం: ద్వివేది

సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను నిశితంగా పరిశీలిస్తున్నామని.. సుమోటోగా కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఇప్పటివరకు రాజకీయపార్టీలకు 89 నోటీసులు జారీ చేశామని చెప్పారు.

16 కోట్లు నగదు సీజ్-ద్వివేది

By

Published : Mar 19, 2019, 5:58 PM IST

సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టుల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సుమోటోగా కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటివరకు రాజకీయపార్టీలకు 89 నోటీసులు జారీ చేశామని చెప్పారు. చట్టం ప్రకారం.. IPC సెక్షన్ 153Aని అతిక్రమిస్తే మూడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎన్నికల ప్రకటన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు 16 కోట్ల రూపాయల నగదు సీజ్ చేశామన్నారు. ఇప్పటివరకు వివిధ అంశాలపై అందిన ఫిర్యాదుల్లో 79 శాతం చర్యలు తీసుకుని... దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని తెలిపారు. రాష్ట్రంలోని 170 నియోజకవర్గాల్లో లక్ష 55 వేల 99 ఓట్లు తొలగించామని ద్వివేది వెల్లడించారు. ఈనెల 25 లోపు ఫారం 6 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి తుది జాబితా ప్రకటిస్తామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details