ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అనిశా డీజీగా శంకబ్రత బాగ్చీ నియామకం - శంకబ్రత బాగ్చీ

అవినీతి నిరోధకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీని నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పునేఠ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ విధుల నుంచి తప్పుకొన్నారు. ఈసీఐతో డీజీపీ ఆర్పీఠాకూర్ భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

అవినీతి నిరోధకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీ నియామకం

By

Published : Apr 4, 2019, 9:54 PM IST

అవినీతి నిరోధకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీని నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పునేఠ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ విధుల నుంచి తప్పుకొన్నారు.ప్రస్తుతం శంకబ్రత బాగ్చీ అవినీతి నిరోధక శాఖలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పునేఠ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీఠాకూర్ ను తక్షణం ఆ విధుల నుంచి తప్పిస్తున్నట్టు ఈసీ తెలిపింది. దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో డీజీపీ ఆర్పీ ఠాకూర్ భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

ABOUT THE AUTHOR

...view details