కృష్ణాజిల్లా నందిగామలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ డ్రైవర్ బుజ్జికి నందిగామ జ్యుడిషియల్ కోర్టు పది రోజులు జైలు శిక్ష విధించింది. జైలుశిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు జాతీయ రహదారులపై విస్తృత తనిఖీలు చేపట్టాలని సూచించింది.
మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్‌కు జైలుశిక్ష - డ్రైవర్
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న చోదకులు..ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నిన్నరాత్రి నందిగామలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. డ్రైవర్‌ను కోర్టులో హాజరుపర్చగా 10 రోజుల జైలుశిక్ష విధించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్
నిన్నరాత్రి నందిగామ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సుల డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. గుంటూరు నుంచి విశాఖ వెళ్తున్న ఈ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మద్యం సేవించినట్లు రుజువుకావటం వలన చోదకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. నందిగామ జుడిషియల్ కోర్టు డ్రైవర్ బుజ్జికి పది రోజుల శిక్ష విధించింది.
ఇవీ చూడండి :తప్పతాగి డ్రైవింగ్.. బస్సులో 40 మంది!