ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

"ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం చేయలేం" - కొవ్వొత్తుల ర్యాలీ

కోల్​కతా వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా ఇవాళ ఐఎంఏ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. వైద్యుల దాడినికి నిరసనగా ఈ సాయంత్రం విజయవాడ, రాజమహేంద్రవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలు పోసే వైద్యులపై దాడులేంటని ప్రశ్నించారు.

ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం చేయలేము : వైద్యులు

By

Published : Jun 17, 2019, 11:39 PM IST


కోల్​కతాలో జూనియర్ డాక్టర్​పై జరిగిన దాడికి నిరసనగా విజయవాడ, రాజమహేంద్రవరంలో ప్రభుత్వ జూనియర్ వైద్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భారతీయ వైద్య మండలి(ఐఎంఏ) పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఓపి సేవలు నిలిపివేశారు. వైద్యులపై దాడి చేయటం హేయమైన చర్య అని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. ప్రభుత్వం వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టాలనుసరించి వైద్యులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. భయపెట్టే వాతావరణంలో వైద్యులు పనిచేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం చేయలేము : వైద్యులు

ABOUT THE AUTHOR

...view details