ఇంటెలిజెన్స్ డీజీ పోస్టుకుముగ్గురు ఏడీజీ స్థాయి అధికారుల పేరును సీఎస్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు. ఆపరేషన్స్ విభాగం ఏడీజీగా ఉన్ననళిన్ప్రభాత్... పోలీసు సిబ్బంది నియామక సంస్థ ఛైర్మన్ కుమార్ విశ్వజిత్, హొంగార్డ్స్ ఏడీజీ కృపానంద త్రిపాఠి పేర్లను జాబితాలో పొందుపరిచారు. వారిపైఎలాంటి శాఖాపరమైన విచారణలు పెండింగ్లో లేవని తెలిపారు. ప్రతిపాదన పరిశీలించిన పిదప ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ పేరును ఖరారు చేయనుంది.
ఇంటెలిజెన్స్ డీజీ పోస్టుకు ముగ్గురి పేర్లతో ప్రతిపాదన - election commission
ఇంటెలిజెన్స్ డీజీ నియామకం కోసం సీఎస్ అనిల్ చంద్రపునేఠా ముగ్గురు ఐపీఎస్ ఉన్నతాధికారుల పేర్లను ఈసీకి ప్రతిపాదించారు. ఆ జాబితాను పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఒకరి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.
సీఎస్ అనిల్ చంద్రపునేఠా