హోదా 'భరోసా' యాత్ర - ఉమెన్ చాందీ
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర అనంతపురం జిల్లా నీలకంఠాపురం నుంచి ప్రారంభమైంది.
అనంతపురం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ బస్సు యాత్ర
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర ప్రారంభమైంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్, కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జి ఉమెన్ చాందీలు బస్సు యాత్రను ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో 9 జిల్లాల మీదుగా శ్రీకాకుళానికి మార్చి 3న చేరనుంది.