రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి భారీ బదిలీలు జరిగాయి. తొమ్మిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సీఎం ఓఎస్డీగా జె.మురళి నియమితులయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కసిరెడ్డి వీఆర్‌ఎన్ రెడ్డి, రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్‌గా డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు కన్నబాబు, రంజిత్ బాషా, అజయ్ జైన్, కె.విజయానంద్, డి.వరప్రసాద్, ఎ.ఆర్.అనురాధలను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయవల్సిందిగా ఆదేశించింది. మొత్తంగా... 53 మంది ఐఏఎస్‌లు, నలుగురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
నూతన కలెక్టర్లు
జిల్లా | కలెక్టర్ |
గుంటూరు | ఐ.శామ్యూల్ ఆనందకుమార్ |
ప్రకాశం | పి.భాస్కర్ |
తూర్పుగోదావరి | డి.మురళీధరరెడ్డి |
నెల్లూరు | ఎం.వి.శేషగిరిబాబు |
అనంతపురం | ఎస్.సత్యనారాయణ |
పశ్చిమగోదావరి | ఎం.ముత్యాలరాజు |
విశాఖ | వి.వినయచంద్ |
కర్నూలు | జి.వీరపాండ్యన్ |
చిత్తూరు | నారాయణభరత్ గుప్తా |
శాఖల కమిషనర్లు
శాఖ | కమిషనర్ |
వాణిజ్యపన్నులశాఖ | పీయూష్‌కుమార్ |
ఇంటర్ విద్యాశాఖ | కాంతిలాల్ దండే |
పురపాలకశాఖ | విజయ్‌కుమార్ |
పంచాయతీరాజ్ | గిరిజాశంకర్ |
సీఆర్‌డీఏ | పి.లక్ష్మీనరసింహం |
సీఆర్‌డీఏ(అదనపు కమిషనర్) | కె.విజయ |
మార్కెటింగ్ శాఖ(ప్రత్యేక కమిషనర్) | ప్రద్యుమ్న |
వ్యవసాయశాఖ | ప్రవీణ్‌కుమార్ |
ఎక్సైజ్ శాఖ | ఎం.ఎం.నాయక్ |
రవాణాశాఖ | సీతారామాంజనేయులు |
ఉద్యానశాఖ | చిరంజీవి చౌదరి |
ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు
శాఖ | ప్రత్యేక కార్యదర్శి |
ఉన్నతవిద్యశాఖ | జేఎస్‌వీ ప్రసాద్ |
అటవీశాఖ | నీరబ్‌కుమార్ ప్రసాద్ |
జలవనరులశాఖ | ఆదిత్యనాథ్ దాస్ |
బీసీ తరగతుల సంక్షేమశాఖ | కరికాల్ వలెవన్ |