ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

చంద్రబాబు.. 'గురువారం ప్రధాని'!

ఎన్డీయే ప్రత్యర్థి పక్షాల కూటమి అధికారంలోకి వస్తే... ప్రధాని ఎవరని జనాల్లో రేకెత్తుతున్న ప్రశ్నకు అమిత్​ షా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం సంధించారు. వారానికి సరిపడా ప్రధానులున్నారన్న ఆయన... ఆదివారం మాత్రం దేశానికి సెలవు ప్రకటిస్తారని హాస్యమాడారు. ఆయన చెప్పిన కథలో ఒక్కొక్కరికి ఒక్కోరోజు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకూ ఓ రోజు ఇచ్చారు.

By

Published : Mar 6, 2019, 8:21 PM IST

అమిత్​ షా

అమిత్​ షా
ఎన్డీయే ప్రత్యర్థి పక్షాల కూటమి అధికారంలోకి వస్తే.... ప్రధాని ఎవరని జనాల్లో రేకెత్తుతున్న ప్రశ్నకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా వ్యంగ్యాస్త్రం సంధించారు. వారానికి సరిపడా ప్రధానులున్నారన్న ఆయన... ఆదివారం మాత్రం దేశానికి సెలవు ప్రకటిస్తారని హాస్యమాడారు. ఆయన చెప్పిన కథలో ఒక్కొక్కరికి ఒక్కోరోజు వస్తే... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంతు గురువారం వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details