వికారి నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలో సుఖ-దు:ఖాలను సమభావంతో చూడాలనేదే ఉగాది ఆంతర్యమని అభివర్ణించారు.
తెలుగు ప్రజలకు చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు - cbn
వికారి నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖశాంతులతో , ఆనందంగా జీవించాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు.
' నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణేతలు ప్రజలే. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించేందుకు...ఒక నిర్ణయం తీసుకునే సువర్ణావకాశం ముందుకొచ్చింది. ఈ సమయంలో ప్రజలు విజ్ఞతతో వ్యవహరిస్తారన్నా నమ్మకం మాకుంది. గత ఐదేళ్లలో కేంద్ర సహకారం లేకున్నా..ఉద్యోగులు, ప్రజల కష్టం అండగా ఎంతో ప్రగతి సాధించాం. ప్రజల సంతోషమే మా ధ్యేయం. నూరు శాతం సంతృప్తి, సుఖశాంతులతో ప్రజలు ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పని చేస్తోంది. అభివృద్ధికి అడ్డుపడే వారితో అప్రమత్తంగా ఉండటం అవసరం' - చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి.