వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో . మంత్రివర్గ కూర్పుపై చర్చ జరిగింది. 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పిస్తున్నామన్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని తెలిపారు. మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం తమవైపు చూస్తోందని... సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలని సూచించారు. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలని నేతలకు సూచించారు.
వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో జగన్ న్యాయకమిటీ సూచనలతోనే టెండర్లు....
హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్ కమిషన్‌పై అడిగానని... ఇకనుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని జగన్ అన్నారు. ప్రతీ కాంట్రాక్టు ప్రక్రియ మొదట్నుంచీ జడ్జి వద్దకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఏడు రోజులపాటు పబ్లిక్ డొమైన్‌లో టెండర్ల ప్రక్రియ ఉంటుందన్న సీఎం... జ్యుడీషియల్ కమిషన్ సూచనల మేరకు ప్రతి టెండర్‌లో మార్పులు ఉంటాయన్నారు. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్ టెండర్ ప్రక్రియ చేడతామని తెలిపారు. రివర్స్ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.
అంచనాలకు మించి దోచుకున్నారు...
చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి తెదేపా నేతలు దోచుకున్నారని సీఎం అన్నారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు చేస్తున్నట్లు జగన్ అన్నారు. ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నామన్న జగన్... అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. మనం వేసే ప్రతి అడుగు ద్వారా ప్రగతి పెరగాలని నేతలకు సూచించారు. నామినేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పనులు కేటాయిస్తామని తెలిపారు.
25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం