చంద్రబాబు చెంతకు కొణతాల! - KONATHALA
మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.. తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. 2 రోజుల క్రితం వైకాపా అధ్యక్షుడు జగన్‌ను కలిసిన ఆయన.. ఇప్పుటు చంద్రబాబు చెంతకు చేరడం.. చర్చనీయాంశమైంది.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.రెండు రోజుల క్రితం జగన్‌ను కలిసిన కొణతాల....వైకాపా కండువా కప్పుకొనేందుకు నిరాకరించారు.భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానన్నారు.వైకాపా అభ్యర్థుల జాబితాలోనూ కొణతాలకు చోటు దక్కలేదు.ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం ప్రాధాన్యం చోటుచేసుకుంది.సీఎంతో భేటీ అనంతరం తెదేపా స్క్రీనింగ్ కమిటీతోనూ ఆయన చర్చించారు.విశాఖలో ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు.ఇదే సమయంలో కొణతాలు రామకృష్ణ చంద్రబాబు భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.