ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి.. 7 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎంకు పార్టీ నేతలు స్వాగతం పలకనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన తూర్పు నౌకాదళ స్థావరం(ఈఎన్సీ)కు చేరుకుంటారు. అక్కడ జరిగే సమావేశంలో పాల్గొని.. రాత్రి 7.30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నావికాదళ అధికారులతో జగన్ భేటీ కానున్నారు. రాత్రి 8.15 గంటలకు రక్షణమంత్రి, సిబ్బందితో కలసి భోజనం చేస్తారు. రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరతారు.
ముఖ్యమంత్రి జగన్ నేడు విశాఖ పర్యటన - సీఎం జగన్
సీఎం జగన్ శనివారం విశాఖ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం తూర్పు నౌకాదళ స్థావరం(ఈఎన్సీ)లో జరిగే సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కానున్నారు.
జగన్
శనివారం సీఎం టూర్ షెడ్యూల్
- సాయంత్రం 6 గంటలకు.......విశాఖకు బయలుదేరనున్న సీఎం
- 7గంటలకు......................విశాఖకు చేరిక
- 7.30గంటలకు.................రక్షణమంత్రి, నౌకాదళ అధికారులతో భేటీ
- 8.15గంటలకు..................రక్షణ మంత్రి, సిబ్బందితో కలిసి భోజనం
- 9గంటలకు .....................తిరిగి గన్నవరం పయనం
Last Updated : Jun 29, 2019, 2:10 AM IST