విభజన జరిగి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే.. ఐదేళ్లు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదు. నిధుల కోసం అడిగితే ఎదురుదాడి చేస్తున్నారని ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దాడులు చేయడం, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం, కావాలని కోర్టులో కేసులు వేయడం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రం రెండంకెల వృద్థి సాధించిందన్నారు చంద్రబాబు.
ఆర్థిక ఇబ్బందుల్లోనూ...రెండంకెల వృద్ధి సాధించాం: చంద్రబాబు
"రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదు... కష్టపడి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ను వదిలి వచ్చేశాం. మళ్లీ మొదటినుంచి రాష్ట్ర నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది. అయినా అభివృద్ధి సాధించాం" ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముఖాముఖి