ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అమరవీరులకు అండగా ఏపీ

జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒక్కొక్క అమర జవాన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించారు.

అమరవీరులకు అండగా ఏపీ

By

Published : Feb 16, 2019, 2:54 PM IST

Updated : Feb 16, 2019, 7:43 PM IST

జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరమని ముఖ్యంత్రి చంద్రబాబు అన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు పుల్వామా ఘాతుకానికి తమ నిరసన తెలియజేస్తున్నారన్న సీఎం...ఒక్క గొంతుకగా నిలిచి అమరుల కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారని అన్నారు.వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించని...ఒక్కొక్క అమర జవాన్ కుటుంబానికి రూ.5లక్షల చొప్పున సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించారు.

మానవ సమాజంలో ప్రాణాలు బలితీసుకునే ఈ తరహా దారుణాలు దుర్మార్గం..అత్యంత హేయమని తెలిపారు.జరిగిన దారుణంలో40మందిCRPFజవాన్లు ప్రాణాలు కోల్పోవడం గుండె చెదిరే విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు.ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యలకైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.మున్ముందు ఇలాంటి ఘోరకలి జరగకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.అమర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని...భారత సైనికులు నిరంతరం ఈ దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాన వేసుకుని అహర్నిశలూ అప్రమత్తంగా వుంటూ తమ విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

అన్ని కుటుంబాలను రక్షిస్తున్నారు.ప్రాణాలను సైతం ఫణంగా నిలిపి తెగువ చూపుతూ మనందరిలో స్ఫూర్తిని నింపుతున్నారని అన్నారు.పుల్వామా దాడిలో40మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలని తెలిపారు.వీర జవాన్ల కుటుంబాలకు నైతికస్థైర్యం అందివ్వడం తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు.సైనికుల జీవితాలను తాము అందించే సాయంతో వెలకట్టలేమని...కానీ, తమవంతు సహకారం అందించాల్సిన బాధ్యతను విస్మరించలేమని తెలిపారు.

Last Updated : Feb 16, 2019, 7:43 PM IST

For All Latest Updates

TAGGED:

cmjavan

ABOUT THE AUTHOR

...view details