ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రజల పక్షాన పోరాటం... టీడీఎల్పీ నిర్ణయం - chinarajappa

గుంటూరు తెదేపా కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం ముగిసింది. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ఓటమిపై సమీక్షించుకున్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాడాలని టీడీఎల్పీ నిర్ణయించింది.

tdp

By

Published : May 29, 2019, 3:47 PM IST

టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు.... మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. ఉప నేతలు, విప్ పదవులు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయాన్ని చంద్రబాబుకే అప్పగించినట్లు వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ... పార్టీ ఓడడంపై విశ్లేషిస్తున్నట్లు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి చెప్పారు. ఇన్‌ఛార్జి వ్యవస్థతో పార్టీకి, కేడర్‌కు అంతరం పెరిగిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంగా తాము ప్రజల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు.

ప్రతిపక్షంగా ప్రజల తరపు పోరాడతాం:తెదేపా

For All Latest Updates

TAGGED:

chinarajappa

ABOUT THE AUTHOR

...view details